రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం హత్యలే: ప్రత్తిపాటి

Category : Prathipati | Sub Category : Chilakaluripet Posted on 2024-04-19 15:39:44


రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం హత్యలే: ప్రత్తిపాటి

చిలకలూరిపేట వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి భారీగా చేరికలు 

రాష్ట్రంలో గడిచిన అయిదేళ్లుగా చోటుచేసుకున్న  రైతు ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం హత్యలే అని ధ్వజమెత్తారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మూడవ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2న స్థానంలో నిలిపిన దుర్మార్గమైన పాలన జగన్ ఏలుబడి అని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కూడా చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీలోకి చేరికల జాతర కొనసాగింది. వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి ప్రత్తిపాటి సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. తాజాగా శుక్రవారం చిలకలూరిపేటకు చెందిన 80 కుటుంబాలతో పాటు గంగన్నపాలేనికి చెందిన 50 కుటుంబాలు పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి.

ఆర్కే వెల్డింగ్ అధినేత షెక్ కరీముల్లా, 80 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక బాలాజీ థియేటర్ సమీపంలోని ఆర్కే వెల్డింగ్ దుకాణం వద్ద జరిగిన కార్యక్రమంలో వారంతా ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 15వ వార్డు కౌన్సిలర్ , సీనియర్ నాయకుడు జాలాది సుబ్బారావు ఆధ్వర్యంలో గంగన్నపాలేనికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. చాగంటి సాంబశివరావు, గింజపల్లి వీరవసంతరావు, కోమటినేని నాగమల్లేశ్వరరావు, మద్దుకూరి నాగమల్లేశ్వరరావు, మద్దుకూరి మణికంఠ, సామినేని వెంకటేశ్వర్లు, దాసరి సుబ్బారావు, మద్దుకూరి సాంబయ్యతో పాటు 50 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందర్నీ పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి చిలకలూరిపేట నియోజకవర్గంలో సైకిల్ జోరు పెరిగిందని, వైసీపీకి ఘోర పరాభవం తప్పదన్నారు. అయిదేళ్లుగా జగన్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, రైతుల్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన పాపానికి జగన్ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వైకాపా పాలనలో రైతుల జీవితాలు మరీ గాలిలో దీపంగా మారాయని, ప్రతి రైతు కుటుంబం నెత్తిన రూ.2.45 లక్షల పైగా అప్పుల కుంపట్లు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్తిపాటి. జాతీయసగటు కంటే ఆంధ్రప్రదేశ్ రైతులపై 2 రెట్లుకుపైగా  రుణభారం ఉందని, 

అందుకు వైకాపా రైతు వ్యతిరేక విధానాలే కారణమన్నారు. తుఫాన్లు, వరదలు, కరవు వంటి విప త్తుల సమయంలో కూడా కొద్దిమందికే పరిహారం అందించారని, పంటనష్టం పరిహారాల్ని కూడా కొందరు వైకాపా నేతల రైతుల ముసుగులో దోచుకున్నారని వాపోయారు. ఆ పరిస్థితుల్లోనే సాగు భారమై, అప్పులు తీర్చే మార్గం లేకనే రైతుల బలవన్మరణాలకు పాల్పడుతున్నారి, ఈ రైతు హంతక ప్రభుత్వాన్ని  సాగనంపడానికి ప్రతిఒక్కరు సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ప్రత్తిపాటి పుల్లారావు.


Search
Categories
Recent News
Leave a Comment: