కూటమి ప్రభుత్వంలో మళ్లీ ఇసుక ఉచితం, నిర్మాణ రంగానికి చేయూత: ప్రత్తిపాటి

Category : Prathipati | Sub Category : Chilakaluripet Posted on 2024-04-19 15:11:02


కూటమి ప్రభుత్వంలో మళ్లీ ఇసుక ఉచితం, నిర్మాణ రంగానికి చేయూత: ప్రత్తిపాటి

ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రాగానే మళ్లీ ఉచిత ఇసుక విధానం తీసుకుని వస్తామని, నిర్మాణ రంగానికి చేయూతనిస్తామని స్పష్టం చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. విస్తారంగా లభించే సహజ వనరు అయిన ఇసుకను బంగారం కంటే ఖరీదుగా మార్చిన జగన్‌రెడ్డి శాండ్‌ మాఫియాకు త్వరలోనే అంత పలకబోతున్నామన్నారు ప్రత్తిపాటి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తీరప్రాంత ప్రజలకు పూర్తి ఉచితంగా, కాస్త దూరంగా ఉన్నవారికి రూ.1000కే ట్రాక్టర్ ట్రక్కు ఇసుక దొరికిన పరిస్థితి నుంచి ఇవాళ ట్రక్కుకు రూ. 5వేలు పెట్టిన దొర్కకపోవడానికి వైకాపా ఎమ్మెల్యేలు, నేత దోపిడీనే కారణమని విమర్శించారు ప్రత్తిపాటి. చిలకలూరిపేట 34వ వార్డు సాంబశివనగర్‌, 38వ వార్డు వైఎస్సార్ కాలనీకి చెందిన 40 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రత్తిపాటి. వారంతా 34వ వార్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయనకు గజమాల వేసి స్వాగతించారు. ద్విచక్రవాహనం నడిపి తెలుగుదేశం శ్రేణులను ప్రత్తిపాటి ఉత్సాహపరిచారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి జగన్‌రెడ్డి ప్రభుత్వంలో హద్దుఅదుపు లేని ఇసుకదోపిడీ వల్ల పేదల సొంతింటికలలు ఆగిపోవడంతో పాటు నిర్మాణరంగంపై ఆధారపడిన 25లక్షల మంది భవననిర్మాణ కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. అదే సమయంలో వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆగిపోవడం వల్ల నిర్మాణరంగం కోలుకోలేని విధంగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్తిపాటి. వీటికి పరిష్కారంగానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మళ్లీ ప్రజలందరికీ ఉచితంగానే ఇసుక అందించాలని నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. దాంతోబాటే ఆగిపోయిన అమరావతిని తిరిగి పరుగులు పెట్టించడం, పెట్టబడులు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా నిర్మాణ  రంగానికి ఊతం అందించాలనే ఆలోచనలో తమ అధినేత ఉన్నారన్నారు ప్రత్తిపాటి.

Search
Categories
Recent News
Leave a Comment: