పంచాయతీలను దోచుకుతింటున్న సీఎం జగన్‌ రెడ్డి: ప్రత్తిపాటి

Category : Prathipati | Sub Category : Chilakaluripet Posted on 2024-04-19 15:32:38


పంచాయతీలను దోచుకుతింటున్న సీఎం జగన్‌ రెడ్డి: ప్రత్తిపాటి

ఒకవైపు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, మరొక వైపు ఖాతాల్లో చిల్లిగవ్వలేక వేలాది పంచాయతీలు అల్లాడిపోతున్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం స్థానిక సంస్థల దోపిడీ ఆపడం లేదని ధ్వజమెత్తారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. 

జలగ రక్తం పీల్చినట్లు స్థానిక సంస్థలకు చెందిన రూ.13వేల కోట్లకు పైగా నిధులు కాజేసిన జగన్ వాటి ఊపిరి ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్తిపాటి. రాష్ట్రంలో నేటికీ 70శాతం మంది జనాభా గ్రామీణప్రాంతాల్లోనే ఉన్నారన్న ఇంగితజ్ఞానం మరిచి సర్పంచ్‌లను రోడ్డుపాలు చేసిన దరిద్రగొట్టు విధానాల్ని తక్షణం సరిదిద్దుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యడ్లపాడు మండలం సంగంగోపాళంవారిపాలెం, చెంఘీజ్‌ఖాన్‌పేట, కోటలో ఎన్నికల శంఖారావం, సూపర్ సిక్స్ పథకాలపై ప్రత్తిపాటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్-6 కరపత్రాలు పంపిణీ చేసి ఓటు అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్రంలో పంచాయతీలు, స్థానిక సంస్థల దయనీయ పరిస్థితులపై జగన్ రెడ్డి ప్రభుత్వ తీరును తూర్పారా బట్టారు. తన రాజకీయ స్వార్థం తప్ప గ్రామస్వరాజ్యం ఊసుపట్టని సైకో అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని 12, 918 పంచాయతీలన్నీ పెను సంక్షోభంలో చిక్కుకున్నాయని వాపోయారు. జగన్‌ దెబ్బతో  కరవుకాలంలోదాహంతో అల్లాడుతున్న పల్లెలకు అత్యవసరంగా మంచినీళ్లు ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేక స్థానికసంస్థల అవస్థలు పడుతున్నాయని వాపోయారు ప్రత్తిపాటి. వీధిదీపాలు, బ్లీచింగ్‌, పారిశుద్ధ్యనిర్వహణకు పంచాయతీలకు ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఇప్పటికైనా వైకాప్రభుత్వం దారి మళ్లించిన 14, 15 వ ఆర్థికసంఘం నిధులు రూ. 13 వేల కోట్లను తిరిగి స్థానిక సంస్థలకు జమ చేయాలని డిమాండ్‌ చేశారు ప్రత్తిపాటి. ఎంతసేపు దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరేం పట్ట ని జగన్ ప్రభుత్వంలో జల్‌ జీవన్‌ మిషన్ వంటి మంచి కేంద్ర పథకాలను కూడా ఉపయోగించు కోలేదని వాపోయారు. కేంద్రప్రభుత్వం ఆ పథకానికి కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఉపయోగించుకోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఏకైక ప్రభుత్వం పనికిమాలిన జగన్‌ రెడ్డి ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. ఫలితంగానే తెలుగుదేశం పార్టీ హయాంలో జల్‌ జీవన్‌ మిషన్‌లో రాష్ట్రాన్ని తొలి 5 స్థానాల్లో నిలబెడితే జగన్ 26వ స్థానానికి పడేశారని మండిపడ్డారు. అలానే సీసీ రోడ్లు, లింకుదారులకు బీటీరోడ్లు, గ్రావెల్ రోడ్లు, పంచాయతీ భవనాల నిర్మాణం, ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు, మరుగుదొడ్లు, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలన్నింటిలో తాము ఏపీని నంబర్‌లో నిలబడితే జగన్ అట్టడుగుస్థానాలకు దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్తిపాటి. అలాంటి స్వర్ణయుగం నుంచి సొంత ఖర్చులతో చేసిన పనులకు బిల్లులు కూడా రాక ఆ‌త్మహత్యలు చేసుకున్న  సర్పంచ్‌ల కుటుంబాల్ని ఆదుకోవాలని, అయిదేళ్లుగా గ్రామ పెద్దల ఉసురుపోసుకున్న పాపానికి వారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ముఖ్యమంత్రి జగన్‌కు సూచించారు ప్రత్తిపాటి పుల్లారావు. గులకరాయి వంటి సెంటిమెంట్ ‌డ్రామాలు కట్టిపెట్టి ముందు పంచాయతీల నిధులు పంచాయతీలకు ఇచ్చి, సర్పంచ్‌లపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుని వారికి క్షమాపణలు చెప్పిన తర్వాతే పల్లెల్లో ఓటడగడానికి రావాలన్నారు.

Search
Categories
Recent News
Leave a Comment: