మతం పేరుతో దళితుల్ని, రిజర్వేషన్ల పేరుతో మైనార్టీలకు జగన్‌ మోసం: ప్రత్తిపాటి

Category : Prathipati | Sub Category : Chilakaluripet Posted on 2024-04-19 15:21:34


మతం పేరుతో దళితుల్ని, రిజర్వేషన్ల పేరుతో మైనార్టీలకు జగన్‌ మోసం: ప్రత్తిపాటి

గిరిజవోలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీమంత్రి ప్రత్తిపాటి

రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని నీచమైన రీతిలో మతం పేరుతో దళితుల్ని, రిజర్వేషన్ల పేరుతో మైనార్టీల్ని మోసం చేసేందుకు జగన్ రెడ్డి శతవిధాల ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. కానీ పేదలపక్షపాతి అని చెప్పుకుని అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చి, వారి ఉసురే తీసిన జగన్‌రెడ్డికి ఆడబిడ్డల ఉసురు తగలకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన ప్రతిఒక్కర్ని మోసం చేసిన జగన్‌కు అసలు ఓటడిగే అర్హత ఎక్కడ ఉండదని సూటి ప్రశ్నలు సంధించారాయన. నాదెండ్ల మండలం గిరిజవోలు గ్రామంలో గురువారం ఎన్నికల శంఖారావం, సూపర్ సిక్స్ పథకాలపై నిర్వహించిన ప్రచారంలో భాగంగా ఈ మేరకు జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, జనసేన నాయకుడు తోట రాజా రమేష్‌తో కలసి ప్రచారం చేసిన ప్రత్తిపాటి ఇప్పటికైనా జగన్‌రెడ్డి నిజస్వరూపాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలని సూచించారు. నవరత్నాల పేరుతో పేదల్ని, రుణమాఫీ, సున్నావడ్డీ పేరుతో డ్వాక్రా మహిళలను, రైతుభరోసా పేరుతో అన్నదాతలందర్నీ  అన్యాయం చేశారని వాపోయారు ప్రత్తిపాటి. డ్వాక్రా డబ్బులకు రక్షణ లేకుండా చేశారని. మద్యనిషేధం చేస్తామని చెప్పి అదే మద్యం వ్యాపారంతో పేదల ప్రాణాలు తీస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంతసేపూ పేదల బలహీనతల్ని ఎలా సొమ్ము చేసుకోవాలి, వారి డబ్బు ఎలా దోచేయాలన్న దురాలోచన తప్ప నిజంగా ప్రజలకుమేలు చేయాలన్న తలంపే వైకా పాలో ఎవరికీ లేదన్నది స్పష్టమన్నారు. మరీ ముఖ్యంగా మద్యం ఉత్పత్తి నుంచి విక్రయాల వరకు కుటుంబసభ్యులు, బంధువులనే పెట్టుకుని జగన్‌ వేల కోట్లు దండుకున్నారని తెలిపారు. అలా విచ్చలవిడిగా దోచుకున్న సొమ్ముతో ఏం చేసుకుంటారని.. ఒక్కో ప్యాలెస్‌లో 40 బెడ్‌ రూమ్‌లు కట్టుకున్నారని.. ఇద్దరికి అన్ని ప్యాలెస్‌లు ఎందుకని ప్రశ్నించారు. వైకాపా అయిదేళ్ల పాలనలో పేదలకు ఒక్క ఇల్లు అయినా నిర్మించి ఇచ్చారా? దళితులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను షరతుల పేరుతో కోసేసింది ఎవరు? దళితులకు తెలుగుదేశం ప్రభుత్వం అందించిన 27 సంక్షేమ పథ కాలు రద్దు చేసిందెవరు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ప్రత్తిపాటి. వీటితో పాటు పెరిగిన పన్నులు, ఛార్జీలు, ధరల నుంచి ఉపశమనం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, చంద్రబాబు నాయకత్వంలో మహిళలకు ప్రత్యేకసంక్షేమ విధానాలు అమలవుతాయనీ హామీనిచ్చారు. మంచిని ప్రోత్సహించి, అభివృద్ధికి సహకరించి, అవినీతిని తరిమికొట్టాలని వైసీపీ నాయకులు, కార్యకర్తలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాని తెలిపారు ప్రత్తిపాటి. అనంతరం మాట్లాడిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఎన్నికల ముందు దళితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకుండా ఆయా వర్గాల వారిని నిండా ముంచింది కాక వారిపై దాడులు, హత్యలు, అత్యాచారాల్ని ప్రోత్సహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందాల్సిన రూ.1.14 కోట్ల సబ్‌ప్లాన్ నిధుల్ని దారి మళ్లించారని, రూ.2,118 కోట్ల అభయహస్తం నిధుల్ని తినేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు మాల, మాదిగల కోసం చంద్రబాబు అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం ద్వారా రూ.15 లక్షల ఆర్థికసాయం చేసి విదేశాలకు పంపించారన్నారు. ఆ పథకాన్ని కూడా జగన్‌రెడ్డి రద్దు చేశారని మండిపడ్డారు. చిలకలూరిపేట నియోజవర్గం జనసేన ఇన్‌ఛార్జ్‌ తోట రాజా రమేష్ మాట్లాడుతూ మోసాలతోనే అధికారంలోకి వచ్చిన జగన్‌ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూనే వారిని దగా చేశారన్నారు. గతంలో వారికి ఉన్న సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసిన జగన్‌కు బుద్ధి చెప్పడా నికి ఈ ఎన్నికలే సరైన అవకాశమని సూచించారు. ఐదేళ్లుగా పల్నాడు అభివృద్ధికి పాటుబడిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేటకు పెద్దదిక్కుగా అన్ని విధాలా అభివృద్ధి చేసిన ప్రత్తిపాటిని ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగానే గిరిజవోలుకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో 10 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ప్రత్తిపాటి.

Search
Categories
Recent News
Leave a Comment: